Sunday, August 24, 2008

సంకల్పాన్ని ధరించాలి.

ఆభరణాల్నిధరించడం వల్ల ప్రయోజనం ఎంత మాత్రమూ లేదు. సంకల్పాన్ని ధర్నిచాలి. అది మొక్కవూని విజయాన్నందిస్తుంది. అల్పశ్చకాలో బహువశ్చ విఘ్నః అన్నారు. కాలం చాలా తక్కువ. కాని ఆటంకాలు ఎక్కువ. ఏదో సాధించలనుకోనేవారు కూడా సాధించలేక చతికిలపడి , దానికి కారణాలుగా ఎన్నో ఇబ్బందులు చూపుతుంటారు. అది సరియిన పద్దతి కాదు. ఎలాంటి కష్టాల్లోనైనా, ఎన్ని అవాంతరాలు ఎదురైన కార్యసాధకుడు వెనుకంజ వేయడు. కర్యసాధకుడేలా ఉండాలో ఈ పద్యం వివరిస్తుంది .

ఒకచో నేలను బవ్వలించు నొకచో నొప్పారు పూసేజ్జపై
నొకచో శకము లారగించు నొకచో నుత్ర్కష్ట శాల్యోదనం
బోకచో బొంత ధరించు నొక్కక తరిన్ యోగ్యాంబర శ్రేణి లె
క్కకు రానియాడు కార్యసాధకుడు దుఖంబున్ సుఖబున్ మదిన్


ఒక పని మీద తదేక దృష్టి నిలిపినవాడు పరిస్థితులకు అనుగుణంగా సర్దుకుపోతాడు. అవసరమైతే నేలమీద పడుకుంటాడు. ఆకులూ అలములూ తింటాడు. ఏమి లేకపోతే బొంతనే ధరిస్తాడు. అంతే తప్ప నాకు పట్టేమంచాలు , పరుపులు , పంచభక్ష్య పరమాన్నాలు కావాలని కూర్చోడు. హినాదికాలేవి కార్యసాధకునికి లెక్కకు రావు. అన్నిరకాల సాధనాలు చేకూరినప్పుడు విజయం సాధించడంలో మజా ఏముంటుంది ? అసౌకర్యల్లోంచి కార్యసాధకులు అద్బుత విజయాల్ని పొందుతారు .

శ్రీరాముడు లక్ష్యం లంకను జయించడం. అదేమి చిన్న విషయం కాదు. సముద్రాన్ని దాటాలి . శత్రువు రావణాసురుడు మహాబలవంతుడు, సైన్యాసంపన్నుడు, దానవుడు. రాముడు సామాన్య మానవుడు . యుద్దంలో సహకరించేవారు వానరులు , ఒకటి చెబితే , ఇంకోకకటి చేసేరకం .

సైన్యమా? రాధా, గజ , అశ్వాది బలాలు లేవు . కేవలం సంకల్పబలమే . ఐన రాముడు ఈ లోటుపాట్లను చూసి వెనుకంజ వెయ్యలేదు. మొత్తం రాక్షసులందర్నీ సంహరించాడు. కాబట్టి - క్రియా సిద్ధి : సత్వే భవతి మహతాం నోపకరనే . కార్య సాధకులకు సంకల్పమే సాధనం. అదే ఆయుధం . తక్కిన సాధనాలు , ఆయుధాలు ఏమయాన సరే - సంకల్పం లేకపోతే పనిచెయ్యవు . ఎన్ని సమకూర్చుకున్న సంకల్పబలం లేనివాడు ఎమీ సాధించలేదు. ఏమి లేకపోయినా సంకల్పన్నే ధరించిన కార్యశూరుడు అసంభావాల్ని సుసంభావాల్ని చేసే ధైర్యం కలవాడై లోకం నుదుటి పై విజయతిలకాన్ని దిద్దుతాడు !